Viral video: ఇంత దారుణమా హోమ్ వర్క్ చెయ్యలేదు అని స్కేల్‌తో తలపై కొట్టిన టీచర్.. చిన్నారి ప్రాణం దక్కేనా..?

Updated on: Sep 13, 2022 | 9:34 AM

హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడి మరణించింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని


హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడి మరణించింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు ఏడేళ్లు. ఫాతిమా ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న ఓ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్‌ 3న ఫాతిమా హోంవర్క్‌ చేయలేదని టీచర్ హింసించారు. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టారు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడలో వేసి మోయించారు. అంతటితో ఆగకుండా.. చిన్నారి త‌ల‌పై స్కేల్‌తో బలంగా కొట్టారు.దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే.. తల్లిదండ్రులు ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా, తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో.. ఆమెను హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఫాతిమా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫాతిమాను కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. చిన్నారి ఫాతిమా మృతి చెందిన వార్త తెలుసుకున్న డీఈఓ.. పాఠశాలను మూసివేయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 13, 2022 09:34 AM