Crime: సీరియల్ కిల్లర్.. వేశ్యలను ఇంటికి పిలిచి గొంతు కోసి .. కిచెన్‌లో పూడ్చి.. వీడియో.
రువాండా రాజధాని కిగాలీలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. కిగాలీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి 14 మంది వేశ్యలను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుని వారిని చంపేసాడు .
రువాండా రాజధాని కిగాలీలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. కిగాలీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి 14 మంది వేశ్యలను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుని వారిని చంపేసాడు . అనంతరం తన ఇంట్లోని కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఇలా వరుసగా 14 మందిని హతమార్చాడు. 34 ఏళ్ల ఈ సీరియల్ కిల్లర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కిచెన్ లో అనుమానం వచ్చి తవ్వి చూడగా 10 మృతదేహాల అవశేషాలు దొరికాయి. అయితే సదరు నిందితుడు హతమార్చిన వారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 10 మృతదేహాలను పాతి పెట్టాడని, మిగతా వాటిని యాసిడ్ పోసి కరిగించినట్లు చెబుతున్నారు. 34 ఏళ్ల నిందితుడిపై హత్య, దోపిడీ వంటి నేరారోపణలపై జులైలో అరెస్టు చేశారు. అయితే కచ్చితమైన సాక్ష్యాధారాలు చూపకపోవడంతో అతనికి బెయిల్ మంజూరు అయింది. అయినప్పటికీ.. అతని నేరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేశ్యలైతే కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారి గురించి ఆరా తీసేవారు తక్కువగా ఉంటారని, స్నేహితులూ పెద్దగా ఉండరన్న ఉద్దేశంతో వారిని ఇంటికి పిలిచి హత్య చేసాడని భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఆడవారితో పాటు పురుషులు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్త్రీ, పురుష వేశ్యలను ఇంటికి పిలిచి వారిని ప్రలోభపెట్టేవాడని, ఆ తర్వాత వారి గొంతు కోసి చంపేసే వాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..