Roti making: ఎవర్‌గ్రీన్‌ హోటల్‌లో దారుణం.. రోటీలు చేస్తూ ఇతనేం చేసాడో మీరే చూడండి..

Updated on: Jul 09, 2022 | 9:22 AM

ఉత్తరప్రదేశ్‌లో రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది . ఈసారి బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మివేస్తూ...


ఉత్తరప్రదేశ్‌లో రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది . ఈసారి బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డాడు . ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడు హోటల్ ఆర్టిజన్ అర్బాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన నజీబాబాద్‌లోని జలాలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.. నిందితుడు అర్బాజ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు, రాజధాని లక్నో, మీరట్ నుండి కూడా తయారుచేస్తున్న ఫుడ్‌ ఐటమ్స్‌పై ఉమ్మి వేసిన కేసులు నమోదయ్యాయి.జలాలాబాద్ చౌక్‌లో ఎవర్‌గ్రీన్ అనే ఓ హోటల్‌ ఉంది. భోజనం చేద్దామని ఆ హోటల్‌కి వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సీన్‌ చూసి షాకయ్యాడు. అక్కడ రోటీ తయారు చేస్తున్న వ్యక్తి రోటీ తయారు చేసేటప్పుడు దానిపై ఉమ్మి వేస్తున్నాడు. వెంటనే ఆసీన్‌ మొత్తం తన మొబైల్‌లో రికార్డ్‌ చేసాడు సదరు కస్టమర్‌. తరువాత ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది తీవ్రంగా వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల కంట పడటంతో వెంటనే రంగంలోకి దిగి ఆ రోటీ మేకర్‌ను అరెస్ట్‌ చేసారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గత సంవత్సరం, లక్నోలోని కాకోరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో రోటీలు చేయడానికి పిండిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 09, 2022 09:22 AM