Viral Video: వినాయక మండపంలో అద్భుతం.. శివుడి బొమ్మ మెడలో నిజమైన నాగుపాము.!
దేశవ్యాప్తంగా వినాయకచవితి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేసిన ఓ గణేష మండపంలో అద్భుతం చోటుచేసుకుంది. మండపంలో వినాయకుడితోపాటు శివపార్వతుల విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు. కుటుంబ సమేతంగా భక్తులను ఆశీర్వదిస్తున్న సదాశివుణ్ణి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా వినాయకచవితి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేసిన ఓ గణేష మండపంలో అద్భుతం చోటుచేసుకుంది. మండపంలో వినాయకుడితోపాటు శివపార్వతుల విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు. కుటుంబ సమేతంగా భక్తులను ఆశీర్వదిస్తున్న సదాశివుణ్ణి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడో ఏమో శివుని మెడలో ఎప్పుడూ హారంగా ఉండే నాగరాజు సరాసరి మండపానికి వచ్చాడు. అక్కడున్న శివుని విగ్రహం మీదుగా వెళ్లి ఆయన మెడలో హారమైపోయాడు. ఈ అద్భుతాన్ని చూసి కొందరు మహాగణపతి మహిమ అనుకుంటే.. కొందరు మాత్రం నాగరాజును చూసి భయంతో పరుగులు తీశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు వినాయక దర్శనం అనంతరం బయట ఉన్న శివపార్వతుల దర్శనం చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఓ నాగుపాము శివుడి విగ్రహం పై ప్రత్యక్షమైంది. ఎక్కడ నుండి వచ్చిందో? ఎలా వచ్చిందో తెలియదు కానీ పాము మాత్రం శివుడి మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది. దీంతో దర్శనం చేసుకుంటున్న భక్తులు భయంతో పరుగులు తీశారు. తరువాత ఒకింత తమాయించుకొని తిరిగి విగ్రహం వద్దకు చేరుకున్నారు. వినాయక చవితి నవరాత్రుల పర్వదినాన సాక్షాత్తు నాగుపాము శివుడి వద్దకు చేరుకొని మెడలో ప్రత్యక్షమైందని భక్తులు తమ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆ విషయం ఆ నోటా ఈ నోటా విని మెడలో పాముతో ఉన్న శివపార్వతులను దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు భక్తులు. అనంతరం స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

