Rare Fish: హిమాలయాల్లో మాత్రమే ఉండే అరుదైన చేప.. తూర్పు కనుమల్లో ప్రత్యక్షం.
ఎక్కడో హిమాలయాల్లోని కొలనుల్లో కనిపించే అరుదైన చేప.. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో దర్శనమిచ్చింది. జాలర్ల వలకు చిక్కింది. 24 కిలోల బరువు ఉండే ఈ చేప.. అత్యంత అరుదైన జాతిగా చెబుతున్నారు మత్స్యకారులు. మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలవబడే ఈ చేపకు శాస్త్రీయ నామం టార్ ఫిష్. పులసకు పెద్దన్నలా ఉండే ఈ చేప తూర్పు కనుమల్లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎక్కడో హిమాలయాల్లోని కొలనుల్లో కనిపించే అరుదైన చేప.. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో దర్శనమిచ్చింది. జాలర్ల వలకు చిక్కింది. 24 కిలోల బరువు ఉండే ఈ చేప.. అత్యంత అరుదైన జాతిగా చెబుతున్నారు మత్స్యకారులు. మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలవబడే ఈ చేపకు శాస్త్రీయ నామం టార్ ఫిష్. పులసకు పెద్దన్నలా ఉండే ఈ చేప తూర్పు కనుమల్లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్‌లో జాలర్లకు 24 కిలోల అత్యంత అరుదైన గెలస్కోపి, మిలట్రీ మౌస్ చేప చిక్కింది. దీంతో ఒక్కసారిగా మత్య్సకారులు షాక్ అయ్యారు. హిమాలయాల్లో మాత్రమే కనిపించే చేప చిక్కడంతో ఉబ్బితబ్బయ్యారు. మమూలుగా అయితే ఈ చేప 5 కిలోలనుంచి 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈ చేపలు ఉత్తర భారత హిమాలయాల ప్రాంతంలో మాత్రమే దర్మనమిచ్చే అరుదైన చేప. దీన్నే టార్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఒకసారి సీలేరు, డొంకరాయి జలాశయాలలో ఇవి కనిపించాయి. ఈ చేపలో జీవ వైవిధ్య పరంగా, పోషకాహారం పరంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రుచికి దీనికి ఇదే సాటి. వీటిలో 68 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ యాసీడ్స్, ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా విలువలు ఇది కలిగి ఉంటుందట. ఈ చేపల ఆచూకీ అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతంఅడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాలలో లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెల రిజర్వాయర్ల ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అతి శీతల ప్రాంతంలో ఉండే ఈ చేపలు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
