Viral Video: కంటిమీద కునుకులేకుండా చేసింది.. చివరికి జేసీబీకి బలైపోయింది.

Updated on: Sep 11, 2023 | 8:38 AM

వారంరోజులగా గ్రామంలో సంచరిస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఓ సారి పొదల్లో కనిపిస్తే, మరోసా పొలంలో కనిపించేది.. ఇంకోసారి కోడిని తింటూ హడలెత్తించేది. తీరా పట్టుకుందామని ప్రయత్నిస్తే కళ్లుగప్పి మాయమయ్యేది. అడుగు బయటపెట్టాలంటే భయం.. చీకటిలో ఏమూలన నక్కి ఎవరిపై ఎటాక్‌ చేస్తుందోనిని ఆందోళన. దాంతో విసుగుచెందిన గ్రామస్తులు ఎలాగైనా దాని అంతు చూడాలనుకున్నారు.

వారంరోజులగా గ్రామంలో సంచరిస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఓ సారి పొదల్లో కనిపిస్తే, మరోసా పొలంలో కనిపించేది.. ఇంకోసారి కోడిని తింటూ హడలెత్తించేది. తీరా పట్టుకుందామని ప్రయత్నిస్తే కళ్లుగప్పి మాయమయ్యేది. అడుగు బయటపెట్టాలంటే భయం.. చీకటిలో ఏమూలన నక్కి ఎవరిపై ఎటాక్‌ చేస్తుందోనిని ఆందోళన. దాంతో విసుగుచెందిన గ్రామస్తులు ఎలాగైనా దాని అంతు చూడాలనుకున్నారు. అంతే జేసీబీని రంగంలోకి దించారు. పొదలతవ్వేశారు. అంతే ఒక్కసారిగా బయటకు వచ్చింది 15 అడుగుల భారీ కొండచిలువ. దానిని చూసి దెబ్బకు జడుసుకున్నారు జనం. భయంతో పరుగులు తీసారు. ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పెద్ద కొండచిలువను జెసిబి ఆపరేటర్ జెసిబికి ఉన్న ఇనుప పళ్ళ తొట్టెతో దానిని బలంగా కొట్టి హతమార్చాడు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా కంటిమీద కునుకు లేకుండా కొండచిలువ భయంతో బిక్కుబిక్కున బతికిన గ్రామస్తులకు ఉపశమనం లభించింది. అయితే చాలామంది దీనిని ఖండిస్తున్నారు. ఆ కొండచిలువను అంతమొందించడం సరికాదంటున్నారు. స్నేక్‌ క్యాచర్‌కి సమాచారం ఇస్తే వారు సురక్షితంగా దానిని అడవిలో వదిలేవారని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..