Police: ఏఎస్‌ఐ ఇంట్లో భారీ చోరీ.. దొంగల ఆచూకీ కోసం బాబా సాయం కోరిన పోలీసు అధికారి.వీడియో వైరల్.

|

Jan 15, 2023 | 10:00 AM

సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే... వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్‌..


సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే… వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్‌.. వారే బాబాలు. మనదేశంలో బాబాలకు కొదవేముంది చెప్పండి? తాజాగా ఓ పోలీసు అధికారి తన ఇంట్లో చోరీ జరిగితే దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో జరిగింది. డిసెంబరు 23న జరిగిన ఈ ఘటనలో చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో ఈ ఏఎస్‌ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన బాబా.. ఆయన ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే.. క్లూ మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పారు. అదండీ సంగతి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 15, 2023 08:57 AM