రూ. 900 కోట్ల విలువైన విమానాన్ని గాల్లో వదిలేసి దూకేశాడు.. వీడియో వైరల్.

|

Sep 22, 2023 | 5:37 PM

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్‌-35 గత ఆదివారం అమెరికాలో అదృశ్యమైంది. ఒక రోజు తర్వాత దాని శకలాలు దొరికాయని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఈ విషయంలో స్థానికులు సాయం కూడా అధికారులు తీసుకున్నారు. సౌత్ కరొలినాలోని నార్త్ చార్ట్‌స్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం విమానం గాల్లో..

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్‌-35 గత ఆదివారం అమెరికాలో అదృశ్యమైంది. ఒక రోజు తర్వాత దాని శకలాలు దొరికాయని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఈ విషయంలో స్థానికులు సాయం కూడా అధికారులు తీసుకున్నారు. సౌత్ కరొలినాలోని నార్త్ చార్ట్‌స్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం విమానం గాల్లో ఎగురుతుండగా లోపం తలెత్తడంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఆటో పైలెట్ మోడ్‌లో పెట్టి పారాచుట్ సాయంతో తప్పించుకున్నాడు. తప్పించుకున్న పైలట్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన ఈ యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలు విలియమ్స్‌బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు.: ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్‌-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు అలా జరగలేదు. మరోవైపు విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయం కోరడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..