Viral: విమానం గాల్లో ఉండగా పైలెట్ మరణం.. ఆ తర్వాత ఏం జరిగింది.?
టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది. అమెరికాలోని సియాటెల్ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది. అమెరికాలోని సియాటెల్ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రతినిధి వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి విమానం సియాటెల్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో 59 ఏళ్ల పైలట్ పెహ్లివాన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయన కోలుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలవడంతో తుది శ్వాస విడిచారు.
దీంతో, వెంటనే కోపైలట్ రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో విమానాన్ని న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సియాటెల్ నుంచి బయలుదేరిన 8 గంటలకు ఈ ఘటన సంభవించింది. పెహ్లివాన్ పైలట్ 2007 నుంచి టర్కీ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నిబంధనలను అనుసరించి మార్చి 8న జరిపిన పరీక్షల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. దీంతో, యథావిధిగా ఆయన పనుల్లో చేరిపోయాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం సంభవించింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు కూడా సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, పైలట్ మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు. పైలట్ మరణంపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.