Real hero: ఇతను నిజంగా రియల్‌ హీరో.. ప్రాణాలు ఫణంగా పెట్టి మహిళను కాపాడి.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Updated on: Sep 23, 2022 | 9:40 PM

పక్కవాడు ఏమైపోతే మనకెందుకు.. మనం బావుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు చూస్తే మానవత్వం ఇంకా మిగిలిఉంది అనిపిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన.


పక్కవాడు ఏమైపోతే మనకెందుకు.. మనం బావుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు చూస్తే మానవత్వం ఇంకా మిగిలిఉంది అనిపిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఓ వ్యక్తి తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు. ఫ్లోరిడా ఫోర్ట్‌ వాల్టన్‌ బీచ్‌లో సెప్టెంబర్‌ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్‌ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. దాంతో ఆ దొంగ ఆమెను షూట్‌ చేయబోయాడు. అంతే అదే క్షణంలో మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది.ఇక ఆ మహిళను కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్‌లో పని చేసే మైకేల్‌ గోర్డాన్‌గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్‌కు మంచి పేరు తెచ్చినందుకు యాజమాన్యం.. గోర్డాన్‌ను అభినందించింది. సూపర్‌ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 23, 2022 09:40 PM