Anand Mahendra: లెక్కల మాస్టర్ తెలివికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్…
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరు. ఆ ట్యాలెంట్‌ను గుర్తించి ప్రజల్లోకి తీసుకురావడమే ఆయన ప్రత్యేకత. తన సోషల్ మీడియా వేదికగా అలాంటి ఎన్నో వీడియోలను పంచుకున్నారు..
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టరు. ఆ ట్యాలెంట్‌ను గుర్తించి ప్రజల్లోకి తీసుకురావడమే ఆయన ప్రత్యేకత. తన సోషల్ మీడియా వేదికగా అలాంటి ఎన్నో వీడియోలను పంచుకున్నారు.. వారిని ప్రోత్సహించారు కూడా. తాజాగా ఓ లెక్కల మాస్టారు తయారు చేసిన కారుకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్‌లో పంచుకున్నారు. ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. అయితే శ్రీ నగర్‌కు చెందిన ఓ లెక్కల టీచర్ ఆ మాటను అక్షరాలా పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ విన్నూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఈ లెక్కడ మాస్టారి ట్యాలెంట్‌కి ఫిదా అయిపోయిన టెక్ దిగ్గజం.. అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. “బిలాల్ ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే అన్నారు. అంతేకాదు.. ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలంటూ… ఈ డిజైన్ మరింత అభివృద్ధి చేసేందుకు తమ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు. “ఇలాంటివి మార్కెట్ లోకి రావాలని తమ కామెంట్ల ద్వారా కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

