Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం మెచ్చుకొని 120000 రూపాయలు డొనేట్ చేసిన రోగి..
అతని పేరు సిహెచ్ రామక్రిష్ణ, క్రిష్ణాజిల్లా తిరువూరు సొంతూరు. ఆర్టిసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెలుతున్నాడు. అయితే అనుకొకుండా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో రెండు కాళ్లు తొడల వద్ద విరిగిపోయాయి. అదే విధంగా తలకు దెబ్బ తగిలింది. వెంటనే రామక్రిష్ణను ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్తితి పరిశీలించిన ప్రవేటు డాక్టర్లు అత్యాధునిక..
అతని పేరు సిహెచ్ రామక్రిష్ణ, క్రిష్ణాజిల్లా తిరువూరు సొంతూరు. ఆర్టిసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెలుతున్నాడు. అయితే అనుకొకుండా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో రెండు కాళ్లు తొడల వద్ద విరిగిపోయాయి. అదే విధంగా తలకు దెబ్బ తగిలింది. వెంటనే రామక్రిష్ణను ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్తితి పరిశీలించిన ప్రవేటు డాక్టర్లు అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ చేయాలని అందుకు పది లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అయితే రామక్రిష్ణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రవేటు వైద్యం చేయించుకునే సాహాసం చేయలేకపోయాడు. అయితే ఆ నోటా ఈ నోటా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గురించి ఉన్నాడు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందిస్తారని తెలుసుకున్నాడు. గుంటూరు జిజిహెచ్ రిఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక, మొండి, అత్యంత్య క్లిష్ణమైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. రామక్రిష్ణ వెంటనే గుంటూరులోని జిజిహెచ్ కు వచ్చాడు. ఆర్డోపెడిక్ విభాగంలో చేరాడు. ఆ విభాగం ప్రొఫెసర్ అద్దెపల్లి శ్రీనివాసరావు రోగిని పరీక్షించాడు. పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ఆసుపత్రి వైద్యులు సిద్దమైయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఈహెచ్ఎస్ కింద అడ్మిట్ చేసుకున్నారు. రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. అలాగే తలకు తగిలిన దెబ్బలకు చికిత్స అందించారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నాడు. అయితే రెండు మూడు నెలల తర్వాత నడవగలుగుతాడని అప్పటి వరకూ వైద్యం అందించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి ధైర్యం కోల్పోకుండా వైద్యం అందించి తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చిన వైద్యులకు రోగి అభినందనలు తెలిపాడు.
అయితే ప్రవేటు ఆసుపత్రిలో పది లక్షల రూపాయలఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించిన ఆసుపత్రికి తనవంతుగా ఏదైనా చేయాలని రామక్రిష్ణ అనుకున్నాడు ఇదే విషయాన్ని ఆసుపత్రి ఆర్డోపెడిక్ వైద్యులకు, సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ చెప్పాడు. దీంతో వారంతా చర్చించుకొని ఆర్ధో పెడిక్ విభాగంలో అవసరమైన పరికరాలును ఇవ్వాలని సూచించారు . దీంతో లక్షా ఇరవై వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాటిని ఆసుపత్రి వైద్యులకు అందించాడు. ఢిఛార్జ్ రోజునే వాటిని వారికి అందించి క్రతఘ్నతలు తెలిపాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సరైన వైద్యం అందన్నది అపోహ మాత్రమేనని రామక్రిష్ణ అన్నారు. లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రవేటు వైద్యులు చెబితే ప్రభుత్వ వైద్యులు ఉచితంగా చికిత్స అందించారన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు బాగున్నాయని పేద వాళ్లు తప్పకుండా వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...