Vandebharat Train Food: వందే భారత్‌ రైల్లోని ఆహారంలో బొద్దింక.! ఫోటోలు షేర్‌ చేసిన ప్యాసింజర్‌.

|

Feb 07, 2024 | 7:15 PM

రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్‌ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడి ఫుడ్‌ ప్యాకెట్‌లో చచ్చిన బొద్దింక కనిపించింది.

శుభేందు కేశరి అనే వ్యక్తి ఫిబ్రవరి ఫిబ్రవరి 1వ తేదీన రాణి కమలపాటి నుంచి జబల్‌పూర్‌ జంక్షన్‌ వరకూ వందేభారత్‌ రైల్లో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నాడు. కాసేపటికి ఫుడ్‌ ప్యాకెట్‌ వచ్చింది. అయితే, అది తెరిచి చూడగా.. చచ్చిన బొద్దింక కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ అయిన అతడు.. వెంటనే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తన ఫుడ్‌లో బొద్దింక వచ్చిందంటూ రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై IRCTC వెంటనే స్పందించింది. సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. సర్వీస్‌ ప్రొవైడర్‌కి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..