Viral: బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ.. వైరల్ అవుతున్న వీడియో.

|

Sep 24, 2023 | 11:23 AM

చాలామంది వృద్ధాప్యం రాగానే తమ పని అయిపోయిందని భావిస్తారు. తమను తాము నిస్సహాయులుగా భావిస్తే.. కొందరు మాత్రం ఏజ్‌ కేవలం నెంబర్‌ మాత్రమే... మనసుకు దానితో పనిలేదంటూ ఎప్పుడూ హుషారుగా ఉంటారు. 100 ఏళ్ల వయసులో పరుగులు తీసి రికార్డులు సాధించిన వారున్నారు. తాజాగా ఈ బామ్మ కూడా అలాంటివారి జాబితాకు చెందినదే. 66 ఏళ్ల ఈ బామ్మ బైక్‌ నడపడంలో యువకులకే సవాలు విసురుతోంది.

చాలామంది వృద్ధాప్యం రాగానే తమ పని అయిపోయిందని భావిస్తారు. తమను తాము నిస్సహాయులుగా భావిస్తే.. కొందరు మాత్రం ఏజ్‌ కేవలం నెంబర్‌ మాత్రమే… మనసుకు దానితో పనిలేదంటూ ఎప్పుడూ హుషారుగా ఉంటారు. 100 ఏళ్ల వయసులో పరుగులు తీసి రికార్డులు సాధించిన వారున్నారు. తాజాగా ఈ బామ్మ కూడా అలాంటివారి జాబితాకు చెందినదే. 66 ఏళ్ల ఈ బామ్మ బైక్‌ నడపడంలో యువకులకే సవాలు విసురుతోంది. అవును మధ్యప్రదేశ్‌కు చెందిన సోహాన్‌ బాయి అనే ఈ బామ్మ ఒంటరిగా మోపెడ్‌ నడుపుతూ ఏకంగా 600 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె స్టామినాకి సలామ్‌ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతకాలంలో 35 ఏళ్ల కే కొందరు బైక్‌పైన ఓ గంట ప్రయాణించగానే చేతులెత్తేస్తున్నారు. అలసిపోయామంటూ కూలబడిపోతుంటారు. కానీ, ఈ బామ్మ 66 ఏళ్ల వయసులోనూ 600 కిలోమీటర్ల దూరం మోపెడ్‌పై వెళ్లింది. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌ జిల్లా మాన్సాతెహ్సిల్‌లకు చెందిన సోహాన్‌ బాయి చాలా ఏళ్లక్రితమే తన భర్తతో విడిపోయి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ తన పిల్లలను పోషించుకోడానికి పాల వ్యాపారం చేసేది. అందుకు ఆమె మోపెడ్‌ నడపడం నేర్చుకుని దానిపై వెళ్లి పాలు అమ్మేది. అలా ఆమెకు బైక్‌ నడపడంపై పూర్తి పట్టు వచ్చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఒంటరిగా తన మోటారు సైకిలుపైన మధ్యప్రదేశ్‌నుంచి రాజస్థాన్‌కి 600 కిలో మీటర్లు ప్రయాణించిందంటేనే అర్ధం చేసుకోవచ్చు. బామ్మ స్టామినాకు స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ వయసులోనూ ఆమె అంత యాక్టివ్‌గా ఉండటం చూసి బామ్మకు సలామ్‌ అంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో అనేకమంది బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వృద్ధాప్యం శరీరానికే గానీ మనసుకు కాదని బామ్మ మరోసారి నిరూపించిందంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..