Business man: కూటి కోసం కోటి విద్యలు.. మార్కెట్లో సరికొత్త బిజినెస్‌.. తోపుడుబండిపై దాటిస్తున్న వ్యక్తి..

|

Sep 27, 2022 | 9:39 AM

కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా ఏ పని చేసి అయినా డబ్బులు సంపాదించడం ముఖ్యం. ఆర్థిక పరమైన అంశాలపై నిపుణులు ఎవరైనా


కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా ఏ పని చేసి అయినా డబ్బులు సంపాదించడం ముఖ్యం. ఆర్థిక పరమైన అంశాలపై నిపుణులు ఎవరైనా చెప్పే మాట ఇదే. ఒక్కోసారి కష్టాల్లోనూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించేవారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రాంతంలో నాలుగురోడ్ల కూడలి వర్షాలతో నీరు నిండిపోయింది. రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి. నడుచుకుంటూ వెళితే.. కాళ్లు, బూట్లు, బట్టలు తడిసిపోతాయి. బురద పడి పాడవుతాయి. ఇలాంటి వారికి ఆపద్బాంధవుడిలా వచ్చాడో వ్యక్తి. చిన్నపాటి తోపుడు బండిని రోడ్డుకు ఓ వైపు పెట్టుకుని నిలబడ్డాడు. పాదచారుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ తోపుడు బండిపై నిలబెట్టి.. రోడ్డుకు ఓ వైపు నుంచి మరోవైపు తీసుకెళ్లి వదిలేస్తున్నాడు. రోడ్డుపై నీటిలో నడుచుకుంటూ వెళ్లలేక చాలా మంది అతడికి డబ్బులు ఇచ్చి తోపుడు బండిలో రోడ్డు దాటుతున్నారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకి ‘సమస్యలు ఉన్నప్పుడు సంపాదించే మార్గమిది’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో కాసేపటికే వైరల్ గా మారింది.‘ముందు అవసరం ఏమిటో గుర్తించాలి. ఆ అవసరం తీర్చే పని చేయాలి.. ఇది వ్యాపారంలో మొదటి నియమం. ఈ వ్యక్తి దీన్ని పక్కాగా ఆచరించి చూపిస్తున్నాడు’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘ఇతను ఎవరోగానీ మంచి వ్యాపార వేత్తలా ఉన్నాడు’ అని మరి కొందరు.. ‘సరిగ్గా వెతుక్కుంటే డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు దొరుకుతాయి..’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 27, 2022 09:39 AM