Viral Video: రెప్పపాటు క్షణంలో తప్పిన పెను ప్రమాదం.. ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు..
Viral Video: చిన్న పిల్లలు ఉన్న చోట ఉండరు, నిత్యం ఏదో ఒక అల్లరి పని చేస్తూ పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతుంటారు. ముఖ్యంగా నడక రావడం ప్రారంభమైతే వారిని ఆపడం ఎవరి తరం కాదు. పడుతూ, లేస్తూ నానా హంగామా చేస్తారు. అయితే నడక నేర్చుకోవడంలో..
Viral Video: చిన్న పిల్లలు ఉన్న చోట ఉండరు, నిత్యం ఏదో ఒక అల్లరి పని చేస్తూ పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతుంటారు. ముఖ్యంగా నడక రావడం ప్రారంభమైతే వారిని ఆపడం ఎవరి తరం కాదు. పడుతూ, లేస్తూ నానా హంగామా చేస్తారు. అయితే నడక నేర్చుకోవడంలో ఇది భాగమే అయినప్పటికీ కొన్ని సార్లు చిన్నారుల ప్రాణాల మీదికి వస్తుంటాయి. అందుకే తల్లిదండ్రులు ప్రతీక్షణం వారిపై ఓ కన్నేసి ఉంచుతారు. అయినా కొన్నిసార్లు జరిగే పొరపాట్లు పెను విషాదానికి దారి తీస్తుంటాయి. కానీ పేరెంట్స్ షార్ప్‌గా ఉంటే ఎంతటి ప్రమాదాలనైనా తప్పించుకోవచ్చని నిరూపిస్తోంది ఓ వీడియో. ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునే క్రమంలో చూపించిన చాకచక్యం నెటిజన్లతో హ్యాట్సాఫ్ చెప్పిస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. ఓ బాబు స్విమ్మింగ్ పూల్ వద్ద ఒంటరిగా ఉన్నాడు. దగ్గర ఎవరు లేకపోవడంతో పెద్దలను అనుకరిస్తూ పూల్‌లోకి దూకేందుకు ప్రయత్నించాడు. దాదాపు నీటిలో పడుతున్నాడు అనుకుంటున్న సమయంలో, అక్కడే కొంత దూరంలో ఉన్న తల్లి ఆ విషయాన్ని గమనించింది. వెంటనే రెప్పపాటు క్షణంలో బాలుడి వద్దకు వచ్చి నీటిలో పడుతున్న చిన్నారి చొక్కా పట్టుకొని పైకి లాగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఒక వేళ ఆ సమయానికి అక్కడ ఆ చిన్నారి తల్లి లేకపోయినా, ఆమె అంత త్వరగా స్పందించకపోయినా, ఆ బుడ్డోడు నీటిలో మునగడం ఖాయం అయ్యేంది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు మధర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mother of the year!? pic.twitter.com/TIXn8P85gx
— Figen (@TheFigen) April 30, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..
Also Read: Yellow Watermelon: కోనసీమలో అడుగు పెట్టిన పసుపు పుచ్చకాయ.. ఈ పంటతో లాభాలను ఆర్జిస్తున్న రైతు..
Lunar Eclipse 2022: ఈ నెల 16న ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. దీని ప్రభావం ఏఏ దేశాలపై ఉండనున్నదంటే