Mobile Blast: బాంబులా పేలిన మొబైల్‌ ఫోన్‌.. ఇల్లు, కార్లు ధ్వంసం.

|

Sep 30, 2023 | 8:14 PM

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఓ ఇంట్లో తుషార్‌ జగ్‌తాప్‌, శోభా జగ్‌తాప్‌, బాలకృష్ణ సుతార్‌ అనే ముగ్గురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో సెప్టెంబర్‌ 27న చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు, కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఓ ఇంట్లో తుషార్‌ జగ్‌తాప్‌, శోభా జగ్‌తాప్‌, బాలకృష్ణ సుతార్‌ అనే ముగ్గురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో సెప్టెంబర్‌ 27న చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు, కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగిన ఇంట్లో నిసాసం ఉంటోన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  స్థానికులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నాసిక్ జిల్లాలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో పక్కనే ఉంచిన పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాంబ్‌ మాదిరి పేలిన ఈ మొబైల్‌ ఫోన్‌ బ్లాస్ట్‌ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న మొబైల్‌ ఫోన్‌ ఇంతటి విధ్వంసాన్ని సృష్టించడం వెనుక అసలు కారణాలు ఏమైవుంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..