Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే.. దెబ్బకు దొంగలు పరుగో పరుగు! వీడియో

ఇలా చేస్తే.. దెబ్బకు దొంగలు పరుగో పరుగు! వీడియో

Samatha J

|

Updated on: Feb 10, 2025 | 5:56 PM

ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు. అందుకే ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే భయపడుతున్నారు జనాలు. ఎందుకంటే బయటకు వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ ఎక్కువగా ఇళ్లలో చొరబడుతుంటారు దొంగలు. గాఢ నిద్రలో ఉండగా చప్పుడు కాకుండా దొంగలు ఇళ్లు కొల్లగొట్టేస్తుంటారు. అందుకే ఓ వ్యక్తి అదిరిపోయే ఐడియా వేశాడు. దొంగలు ఇంట్లోకి చొరబడితే వెంటనే నిద్రమేల్కొనేలా ఏర్పాటు చేశాడు. అతని ఐడియాకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

 దొంగలు తలలు పట్టుకుంటున్నారు. జగాడ్‌లు సృష్టించడంలో భారతీయులకు సాటి మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. పనికి రాని వస్తువులను కూడా అసాధారణంగా ఆలోచించి అద్భుత ఆవిష్కరణలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి దొంగలు పడితే సులభంగా తెలిసిపోయేలా ఓ ట్రిక్‌ను కనిపెట్టాడు. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను చూస్తే.. ఓ వ్యక్తి తన ఇంట్లో దొంగలు పడితే వెంటనే తెలుసుకోడానికి తలుపు గడియకి దగ్గరగా ద్వారబంధానికి ఓ మేకు కొట్టాడు. ఇప్పుడు ఆ మేకుకి ఓ స్టీలు కంచం తగిలించాడు. ఆ కంచంలో సగభాగం తలుపును కవర్‌ చేసింది. ఇప్పడు తలుపు గడియతీగానే డోర్‌ కదిలి కంచం కింద పడింది. స్టీలు కంచం కిందపడితే ఇంక చెప్పేదేముంది. పెద్ద శబ్ధం వచ్చింది. ఇదండీ అతగాడి ఐడియా. ఒకవేళ రాత్రి సమయంలో ఎవరైనా తలుపు తెరవాలని ప్రయత్నం చేస్తే కంచం కింద పడి పెద్ద శబ్దం వచ్చి అందరికీ తెలిసిపోతుంది. ఈ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.