Viral video: ఎం తెలివిరా నాయన..! భలే ట్రిక్‌ ప్లే చేశాడు.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు..!

Updated on: Aug 28, 2022 | 9:34 AM

ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.. ఒకరు చట్టాన్నిగౌరవిస్తూ, రూల్స్‌ తూ.చ తప్పక పాటించేవారు. రెండో రకం రూల్స్‌ అతిక్రమిస్తూ.. చట్టాలను ఏ మాత్రం లెక్క చేయనివారు.


ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.. ఒకరు చట్టాన్నిగౌరవిస్తూ, రూల్స్‌ తూ.చ తప్పక పాటించేవారు. రెండో రకం రూల్స్‌ అతిక్రమిస్తూ.. చట్టాలను ఏ మాత్రం లెక్క చేయనివారు. పోలీసులు ఆపితే లేదంటే ప‌ట్టుకోడానికి ఛేజ్ చేస్తే భయంతో కంగారుగా త‌ప్పించుకోబోయి దొరికిపోయేవారు కొందరైతే ఇంకొందరు అది పెద్ద విషయం కాదని, పోలీసుల నుండి తెలివిగా తప్పించుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్న వీడియో రెండో కోవకు చెందిన వ్యక్తిని చూపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో, పోలీసులు స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తిని వెంబడిస్తున్నారు. అతను స్కూటర్‌ని ఎడమవైపుకు తీసుకెళ్తే, పోలీసులు కూడా ఎడమవైపు అతనిని అనుసరించారు. కానీ, ఆ వ్యక్తి ఒక కారు దగ్గరికి వెళ్లగానే.. తన స్కూటర్‌ని కారు చుట్టూ తిప్పుకుని, తాను వచ్చిన దారినే తిరిగి వెళ్తాడు. ఇక‌, పోలీసు వ్యాన్‌ను నడుపుతున్న అధికారులకు ఏం జ‌రిగిందో అర్థ‌మ‌య్యేలోపు అత‌డు మాయ‌మ‌య్యాడు. వీడియోకి ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. “పర్ఫెక్ట్ యు టర్న్,” అంటూ నెటిజ‌నులు స్మైలీ ఎమోజీలతో ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 28, 2022 09:34 AM