Sunrise: అక్కడ నాలుగు నెలలు గాఢ అంధకారం.. తర్వాత సూర్యోదయం.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..
మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే
మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం కంప్లీట్ అయింది. ఈ మేరకు అంటార్కిటికాలో సూర్యుడి కిరణాలు పడినట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. సాధారణంగా అంటార్కిటికాలో ఆగస్టులో శీతాకాలం ముగుస్తుంది. దీంతో ఈ నెలలోనే భానుడు తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలో నాలుగు నెలల సుదీర్ఘ సమయం తర్వాత తొలి సూర్యోదయం నమోదైంది. ఈ మేరకు అక్కడ తీసిన ఫొటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. అంటార్కిటికాలో వేసవి, శీతాకాలాలు రెండే ఉంటాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికాలో మే నెలలో శీతాకాలం మొదలవుతుంది. టెంపరేచర్ మైనస్ 70, 80 డిగ్రీలకు పడిపోతాయి. ఆగస్టు వరకు అక్కడ నాలుగు నెలలపాటు గాఢ అంధకారం నెలకొంటుంది. కాగా ఈ కాలాన్ని సైంటిస్టులు తమకు ఉపయోగకరమైనవి గా మార్చుకుంటారు. బయోమెడికల్ పరిశోధనలతోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. వాతావరణాల మార్పులు, మానవ మనుగడ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

