Viral: రూ. 101 కోట్లకు అధిపతి.. ఒంటిపై షర్ట్ కూడా వేసుకోనంత సింపుల్..
కొందరు ఎంత సంపద ఉన్నా చాలా సింపుల్‌గా, సాదాసీదాగా జీవిస్తారు. మరికొందరు ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో కాస్త రిచ్‌గా బ్రతకాలనుకుంటారు. ఇక్కడ ఓ పెద్దాయన కోట్లకు అధిపతి అయి ఉండి చాలా సాధారణ జీవనం సాగిస్తున్నాడు. అలాగని అతను యోగి కాదు, సన్యాసి కాదు. అందరిలాగే సాధారణ వ్యక్తి. ఇతను ఏ ఉద్యోగం చేసేవాడో, ఏ వ్యాపారం చేసేవాడో తెలియదు కానీ రకరకాల సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించాడు.
కొందరు ఎంత సంపద ఉన్నా చాలా సింపుల్‌గా, సాదాసీదాగా జీవిస్తారు. మరికొందరు ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో కాస్త రిచ్‌గా బ్రతకాలనుకుంటారు. ఇక్కడ ఓ పెద్దాయన కోట్లకు అధిపతి అయి ఉండి చాలా సాధారణ జీవనం సాగిస్తున్నాడు. అలాగని అతను యోగి కాదు, సన్యాసి కాదు. అందరిలాగే సాధారణ వ్యక్తి. ఇతను ఏ ఉద్యోగం చేసేవాడో, ఏ వ్యాపారం చేసేవాడో తెలియదు కానీ రకరకాల సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించాడు. అవేవీ అనుభవించకుండా అతి సాధారణ జీవనం సాగిస్తున్నాడు. అదే ఇప్పడు నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది. అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ పెద్దాయన షార్ట్ వేసుకుని పైన ఎలాంటి షర్ట్‌గానీ, టవల్ గానీ లేకుండా అర్థనగ్నంగా ఉన్నాడు.. ఈ సీనియర్ సిటిజన్ కనిపించినంత సాదాసీదా వ్యక్తి కాదు.. 101 కోట్లకు అధిపతి. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెబుతున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాజీవ్ మెహతా వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు.. తనకు 80 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టీ షేర్లు, 21 కోట్ల విలువైన ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు, కోటి విలువైన కర్ణాటక బ్యాంక్ షేర్లు ఉన్నాయని తెలిపాడు. అయినా తనకు సాధారణ జీవితమే ఇష్టమని, అందుకే తాను ఇప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని రాశారు. ఈ పెద్దాయనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 4 లక్షలమందికి పైగా వీక్షించారు. అంతపెద్ద కోటీశ్వరుడు అయి ఉండి కూడా ఇంత సింపుల్‌గా ఎలా జీవించగలుగుతున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అతను ఎక్కడి నుండి వచ్చాడో, అతని పేరు ఏమిటో తెలియదు. అతను కొంకణి, కన్నడ మాట్లాడుతున్నాడు. కాబట్టి, అతను గోవా లేదా ఉత్తర కన్నడకు చెందినవాడై ఉంటాడని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..