Man on Road: ఏంది సామీ ఈ దారుణం.. అది బెడ్‌రూమ్‌కాదు..రోడ్డు.! దిండువేసుకొని మరీ..
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతిఒక్కరూ ఏదో రకంగా సోషల్‌మీడియాలో పాపులర్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు నెట్టింట షేర్ చేస్తున్నారు.
ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా నడిరోడ్డుపై దిండు వేసుకుని హాయిగా పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అతను అడ్డంగా ఉండటంతో వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో కాసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించడమేగాక, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు అతన్ని అరెస్టు చేశారు. అతను ఆసియాకు చెందినవాడని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో ఇలాంటి పనులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
