Viral Video: బుర్‌ఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌లోకి వ్యక్తి.. వీడియో రికార్డు చేస్తూ దొరికిపోయాడు.

|

Aug 20, 2023 | 4:58 PM

కేరళ లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్‌ఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌ లోకి ప్రవేశించాడు. ఈ ఘటన కొచ్చిలోని ఓ ప్రముఖ మాల్‌ లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల యువకుడు కొచ్చిలోని లులు మాల్‌ను సందర్శించాడు. అక్కడ బుర్‌ఖా ధరించి మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి తన ఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాడు.

కేరళ లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్‌ఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌ లోకి ప్రవేశించాడు. ఈ ఘటన కొచ్చిలోని ఓ ప్రముఖ మాల్‌ లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల యువకుడు కొచ్చిలోని లులు మాల్‌ను సందర్శించాడు. అక్కడ బుర్‌ఖా ధరించి మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి తన ఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాడు. రహస్య కెమెరాను వాష్‌రూమ్‌లోని డోర్‌కు అంటించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వాష్‌రూమ్‌ మెయిన్‌ డోర్‌ ముందు నిలబడ్డాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మాల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మహిళ వేషం వేసుకుని వాష్‌రూమ్‌లోని దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేస్తున్నట్లు తేలింది. నిందితుడి నుంచి బుర్‌ఖా, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు యువకుడు ఇన్ఫోపార్క్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిపై ఐపీఎస్‌ సెక్షన్లు 354 (సీ), 419, 66ఈ కింద కేసులు నమోదు చేసారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...