Crocodile Dressed: మొసలి వేషంలో, అసలైన మొసలిని .. ఆటపట్టించబోయాడు.. ఏమైందంటే..?

|

Dec 16, 2022 | 8:55 PM

మొసలి వేషం వేసిన ఒక వ్యక్తి నిజమైన మొసలిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి దగ్గరకు వెళ్లి దాని కాళ్లు పట్టుకుని మూడు నాలుగు సార్లు లాగాడు.


మొసలి వేషం వేసిన ఒక వ్యక్తి నిజమైన మొసలిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి దగ్గరకు వెళ్లి దాని కాళ్లు పట్టుకుని మూడు నాలుగు సార్లు లాగాడు. అయితే ఆ మొసలి పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు చేసిన ప్రమాదకర టీజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నది ఒడ్డున ఒక మొసలి ఉంది. మొసలి వేషం ధరించిన ఒక వ్యక్తి మెల్లగా ఆ మొసలి సమీపానికి వెళ్లాడు. తన చేతులతో దాని కాలిని పట్టుకుని లాగుతూ ఆటపట్టించాడు. నరేంద్ర సింగ్‌ అనే యూజర్‌ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో గురువారం పోస్ట్‌ చేశారు. ‘అతడు ఏం డ్రగ్స్‌ తీసుకున్నాడు?’ అని ఈ వీడియోకు శీర్షిక పెట్టారు.మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ వీడియో చూసి షాకైనట్లు పలువురు పేర్కొన్నారు. ధైర్యం, మూర్ఖత్వం మధ్య సన్నని రేఖ ఉంటుందని ఒకరు విమర్శించారు. చనిపోవడానికి ఇదొక సృజనాత్మక మార్గం అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఆ మొసలి నోట కరుచుకుని నీటిలోకి తీసుకెళ్లే వరకే ఈ వినోదాలు, ఆటలు’ అంటూ మరో యూజర్‌ మండిపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:55 PM