Viral: ఇదేందయ్యా ఇది..! రూ.5 వేల నోట్లు నమిలి మింగేసాడు.. ఎందుకంటే..?

|

Aug 02, 2023 | 7:57 AM

మధ్యప్రదేశ్‌లో కట్నీ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ ప్రభుత్వాధికారి చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో తిడుతున్నారు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతనేం చేశాడంటే.. అధికారులకు ఆధారాలు దొరక్కుండా ఏకంగా 5 వేల రూపాయలను నమిలి మింగేశాడు. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ ప్రభుత్వాధికారి చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో తిడుతున్నారు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతనేం చేశాడంటే.. అధికారులకు ఆధారాలు దొరక్కుండా ఏకంగా 5 వేల రూపాయలను నమిలి మింగేశాడు. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో కట్నీ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. పట్వారీగా పనిచేస్తున్న గజేంద్ర సింగ్ అనే వ్యక్తి తనను లంచం అడిగాడంటూ ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, వారు గజేంద్ర సింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వలపన్నారు. జూలై 24న గజేంద్ర సింగ్ తన వ్యక్తిగత ఆఫీసులో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారి రాకను దూరం నుంచే గమనించిన గజేంద్ర సింగ్ తన చేతిలోని కరెన్సీ నోట్లను గబగబా నమిలి మింగేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అతడు క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...