Viral Video: వామ్మో వీడేం డ్రైవర్రా బాబు.. రాంగ్ రూట్‌లో వచ్చాడని అడ్డుకుంటే ఇలా చేశాడు..

|

Oct 01, 2021 | 12:51 PM

Viral Video: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన కొందరు అస్సలు పాటించరు. తమ నిర్లక్ష్యం కారణంగా ఇతరులకూ ఇబ్బంది కలిగిస్తుంటారు. తీరా తప్పు చేసిన..

Viral Video: వామ్మో వీడేం డ్రైవర్రా బాబు.. రాంగ్ రూట్‌లో వచ్చాడని అడ్డుకుంటే ఇలా చేశాడు..
Follow us on

Viral Video: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన కొందరు అస్సలు పాటించరు. తమ నిర్లక్ష్యం కారణంగా ఇతరులకూ ఇబ్బంది కలిగిస్తుంటారు. తీరా తప్పు చేసిన వారికి ఎందుకు తప్పు చేశావని ప్రశ్నిస్తూ పోలీసులపైకే ఎదురుతిరుగుతుంటారు. దేశంలో ఇలాంటి సంఘటనలు అడపాదపడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడని అడ్డుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌పైనే దాష్టికానికి దిగాడు ఓ ప్రబుద్ధుడు.

వివరాల్లోకి వెళితే విజయ్‌ సింగ్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ముంబయిలోని ఎస్‌వీ రోడ్డులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి అటుగా కారుపై వెళుతున్నాడు. అయితే అతను వచ్చేది రాంగ్‌ రూట్‌ దీంతో వెంటనే రోడ్డుపైకి వచ్చిన విజయ్‌ సింగ్‌ ఆ కారును అడ్డుకున్నారు. అయితే కానిస్టేబుల్‌ను వారిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియన విజయ్‌ సింగ్ కారు బ్యానెట్‌పై ఎక్కి కూర్చున్నాడు. అయితే దీనిని లెక్క చేయని ఆ వ్యక్తి కారును హై స్పీడ్‌తో ముందుకు పోనిచ్చాడు. ఇలా ఏకంగా కిలో మీటర్‌కు పైగా దూరం దూసుకెళ్లాడు. దీనంతటిని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న అధికారులు సదరు డ్రైవర్‌పై ఐపీసీ 353 (ప్రభుత్వ అధికారి విధులకు విగాదం కలిగించినందుకు), 279 (ర్యాష్‌ డ్రైవింగ్‌) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతనికి సరైన శిక్ష పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Crime News: ఘరానా కేటుగాడు.. వితంతువులు, ఒంటరి మహిళలే టార్గెట్‌.. పెళ్లి చేసుకుంటానంటూ..

No Time To Die: 50 ఏళ్లు గడుస్తోన్నా చెక్కు చెదరని బాండ్‌ బ్రాండ్‌.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోన్న ‘నో టైమ్‌ టు డై’..

AP High Court: లిక్కర్ అమ్మకాల పిల్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం..