Viral Video: ఆలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు జరపుతుండగా బయటపడిన అద్భుతం.. ఎక్సక్లూసివ్ వీడియో.
ఇటీవల తరచూ తవ్వకాల్లో అరుదైన పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాలలో పురాతన విష్ణుమూర్తి విగ్రహం
ఇటీవల తరచూ తవ్వకాల్లో అరుదైన పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాలలో పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఈ వార్త దావానలంలా గ్రామమంతా వ్యాపించడంతో ఆ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవారు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. హమీర్‌పూర్ జిల్లాలోని కురారా డెవలప్‌మెంట్ బ్లాక్ ఏరియా పరిధిలోని పతారా గ్రామంలోని అడవుల్లో ఒక చిన్న పురాతన హనుమాన్ దేవాలయం ఉంది. గ్రామస్థులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు దేవుడి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని బయటకు తీసి కడిగి చూడగా అది విష్ణుమూర్తి విగ్రహమని తేలింది. గ్రామపెద్ద పాతర చందా దేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయ ప్రాంగణంలో ఆగస్టు 17 ఆలయ పునర్నిర్మానం కోసం తవ్వకాలు జరపుతుండగా అరుదైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడిందని, దీనిని గ్రామస్తులు ఆలయంలో ప్రతిష్టించారని తెలిపారు. అనంతరం విగ్రహం లభ్యమైన సమాచారాన్ని పురావస్తు శాఖకు అందించారు. విగ్రహం ఎత్తు సుమారు ఒక మీటరు ఉండగా, వెడల్పు అర మీటరు ఉంది. ఈ అరుదైన విగ్రహం ఏ కాలానికి సంబంధించినది అన్న విషయంపై పురావస్తు శాఖ విచారణ జరపనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..