Wife pillow vacation: భార్య లేకపోతేనేం.. పిల్లో ఉందిగా.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో.
సరదాగా హాలిడేస్‌కు వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్‌కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది?
సరదాగా హాలిడేస్‌కు వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్‌కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ యువకుడికి. అయితే భార్య లేకున్నా ఒంటరిగానే టూర్‌కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు.రేమండ్ ఫార్చునడో. భార్య జోనీతో పలవన్ రాష్ట్రంలోని కొరన్‍కు వెకేషన్‌కు వెళ్లాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఆమె రాలేనని చెప్పింది. అయితే ఎలాగైనా టూర్‌కు వెళ్లాలని భావించిన అతడు భార్య లేని లోటు ఉండకూడదు అనుకున్నాడు. దీనికోసం వినూత్న ఆలోచన చేశాడు. భార్య సెల్ఫీ ఫోటోను ముద్రించిన ఓ దిండును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. టూర్‌కు దాన్ని వెంటతీసుకెళ్లాడు. ఇక తను తిరిగిన ప్రతి చోటుకు ఆ దిండును కూడా తీసుకెళ్లాడు రేమండ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రేమండ్ ఆలోచన సూపర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. అతని భార్య చాలా అదృష్టవంతురాలని మరికొందరు అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

