Helicopter: పొలంలో ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. ఏంటా అని ఆరా తీయగా షాక్.!

Updated on: Sep 09, 2024 | 9:41 AM

నల్లగొండ జిల్లాలో ఆకాశంలో చక్కర్లు కొడుతూ అత్యవసరంగా ఓ హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కావడం కలకలం రేపింది. చిట్యాల మండలం వనిపాకలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్‌ అయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం జైపూర్ నుంచి కొన్ని ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది.

నల్లగొండ జిల్లాలో ఆకాశంలో చక్కర్లు కొడుతూ అత్యవసరంగా ఓ హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కావడం కలకలం రేపింది. చిట్యాల మండలం వనిపాకలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్‌ అయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం జైపూర్ నుంచి కొన్ని ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులను రక్షించి వారికి సహాయక చర్యలను అందించిన హెలికాప్టర్లు తిరుగు ప్రయాణమయ్యాయి. ఈ క్రమంలో జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో చిట్యాల మండలం వనిపాకలలోని వ్యవసాయ క్షేత్రంలో ఓ హెలికాఫ్టర్‌ అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాగా, హెలికాప్టర్‌లో ఉన్న పైలట్‌తో సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో హెలికాప్టర్‌లో సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. ఒక్కసారిగా చక్కర్లు కొడుతూ హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.