Crime Video: కుమార్తెను చంపి.. బైకుకు కట్టి ఊరంతా తిప్పిన తండ్రి.. వీడియో.

Crime Video: కుమార్తెను చంపి.. బైకుకు కట్టి ఊరంతా తిప్పిన తండ్రి.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 15, 2023 | 1:59 PM

కూతురు చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిందని, కన్నతండ్రే ఆమెను చంపి ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్తూ ఊరంతా తిప్పాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌ అమృత్‌సర్‌లోజరిగింది. జిల్లాలోని జంధియాలా పట్టణం ముచ్చల్‌ గ్రామానికి చెందిన బావూ అనే వ్యక్తి ఓ కార్మికుడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని 20 ఏళ్ల కుమార్తె చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, మర్నాడు ఇంటికి చేరింది.

కూతురు చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిందని, కన్నతండ్రే ఆమెను చంపి ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్తూ ఊరంతా తిప్పాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌ అమృత్‌సర్‌లోజరిగింది. జిల్లాలోని జంధియాలా పట్టణం ముచ్చల్‌ గ్రామానికి చెందిన బావూ అనే వ్యక్తి ఓ కార్మికుడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని 20 ఏళ్ల కుమార్తె చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, మర్నాడు ఇంటికి చేరింది. దాంతో కూతురిపై అనుమానం వచ్చిన అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టి పదునైన ఆయుధంతో దాడిచేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనానికి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అవి నెట్టింట చేరి వైరల్‌ అయ్యాయి. నిందితుణ్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కుల్దీప్‌సింగ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...