Viral Video: కరెంట్‌ లేకుండానే నీరు తోడేస్తున్న మోటార్‌… రైతు ఐడియాకి నెటిజన్లు ఫిదా.

|

Aug 17, 2023 | 9:02 AM

భారతదేశంలో జుగాడ్‌లకు కొదవే లేదు. చెప్పాలంటే ఇలాంటివారు పట్టాలేని పట్టభద్రులుగా చెప్పొచ్చు. ఇంజనీర్లను మించిన టెక్నాలజీ వీరి సొంతం. తెలివి ఉంటే ఎంతటి సమస్యనైనా ఇట్టే అధిగమించవచ్చని ఇలాంటివారెందరో నిరూపించిన సంఘటనలు మనం చూసాం. తాజాగా ఓ రైతు కరెంట్‌ లేకుండానే పొలానికి నీళ్లు పెడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

భారతదేశంలో జుగాడ్‌లకు కొదవే లేదు. చెప్పాలంటే ఇలాంటివారు పట్టాలేని పట్టభద్రులుగా చెప్పొచ్చు. ఇంజనీర్లను మించిన టెక్నాలజీ వీరి సొంతం. తెలివి ఉంటే ఎంతటి సమస్యనైనా ఇట్టే అధిగమించవచ్చని ఇలాంటివారెందరో నిరూపించిన సంఘటనలు మనం చూసాం. తాజాగా ఓ రైతు కరెంట్‌ లేకుండానే పొలానికి నీళ్లు పెడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కరెంట్ అవసరం లేకుండానే పొలానికి నీళ్లు వదులుతున్నాడు. ఇతడి తెలివితేటలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వ్యక్తి తన పొలానికి నీళ్లు పట్టేందుకు విద్యుత్ అవసరం లేకుండా నడిచే మోటార్‌ను తయారు చేశాడు. ఇందుకోసం బోరు మోటారు ఎదురుగా ఓ స్టాండ్‌పై మోటారుతో పాటూ ఓ చక్రాన్ని కూడా అమర్చాడు. ముందు చేత్తో కొద్ది సేపు చక్రాన్ని తిప్పడం వల్ల బోరు పైపు నుంచి నీళ్లు బయటికి వచ్చాయి. ఫుల్‌ ప్రెజర్‌తో వచ్చిన ఆనీరు ఎదురుగా ఉన్న చక్రంపై పడ్డాయి. దీంతో చక్రం ఇంకా వేగంగా తిరుగులోంది. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అటు మోటారు తిరగడమే కాకుండా పొలానికి నీళ్లు కూడా వెళ్తున్నాయి. పక్కనే ఓ బోర్డు ఏర్పాటు చేసి, దానిపై బల్పులను ఏర్పాటు చేశాడు. ఆన్ చేయగా ఆశ్చర్యకంరగా అన్నీ వెలుగుతూ ఉంటాయి. ఇలా ఫ్రీగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా పొలానికి నీళ్లు కూడా పడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ రైతు తెలివితేటలు అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఇతని ఐడియా సూపర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...