భూమి కోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష.! లోకేష్ న్యాయం చెయ్యాలని..
కబ్జాదారుల కబంద హస్తాల్లో చిక్కుకున్న తమ భూమి కోసం ఓ కుటుంబం పొలంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. తల్లి, కుమారుడు, కుమార్తె శనివారం నుంచి పొలంలో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో దళిత ఒంటరి మహిళ జీవనాధారమైన భూమిని అగ్రవర్ణాలవారు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
కబ్జాదారుల కబంద హస్తాల్లో చిక్కుకున్న తమ భూమి కోసం ఓ కుటుంబం పొలంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. తల్లి, కుమారుడు, కుమార్తె శనివారం నుంచి పొలంలో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో దళిత ఒంటరి మహిళ జీవనాధారమైన భూమిని అగ్రవర్ణాలవారు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో గొట్టిముక్కల సుజాత అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి పొలంలో నిరాహార దీక్ష చేపట్టారు. తన కుటుంబ పోషణకు ఉన్న ఏకైక ఆధారం తనకున్న ఒక ఎకరా పొలాన్ని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అన్యాయంగా ఆక్రమించుకున్నారని, 2016 నుంచి తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరి దళిత మహిళనని, తమ కుటుంబ పోషణకు, తన పిల్లలకు ఆ పొలం ఒక్కటే ఆధారమని, కూలి చేసుకుని బతికే తనను పొలం లాక్కుని బతుకు తెరువు లేకుండా చేశారని తెలిపారు. తమ పొలం తమకు దక్కేవరకూ పొలం నుంచి కదిలేది లేదని బాధిత కుటుంబం పొలంలో బైఠాయించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.