Kolkata: హంతకుడిని పట్టించిన హెడ్ సెట్.! కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్.
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు. చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. దీంతో మెడికోలు, ట్రైనీ డాక్టర్లు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు. చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. దీంతో మెడికోలు, ట్రైనీ డాక్టర్లు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెడికోల ఆందోళనలతో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు. అదే ఆసుపత్రిలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోల్ కతా ఎస్పీ వినీత్ గోయల్ మీడియాకు వివరించారు. ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం చేస్తుండగా నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ హత్య చేశాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి ఒలకబోశాడు. అయితే, హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్ సెట్ దొరికింది. అది బాధితురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయ్యుంటుందని పరిశోధన చేపట్టారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. ఘటనా స్థలంలో దొరికిన హెడ్ సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానించారు. ఇతరత్రా లభించిన ఆధారాలతో సంజయ్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి, నిందితుడికి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

