Madhira: సెల్‌ఫోన్ అనుకుంటే పొరబడినట్లే.. పెళ్లివారి వినూత్న ఆహ్వానం

Edited By: Ram Naramaneni

Updated on: May 12, 2025 | 1:21 PM

సెల్​ఫోన్​లాంటి పెళ్లికార్డును రూపొందించిన ఓ కుటుంబం తయారు చేయించింది. అ వివాహ ఆహ్వాన పత్రిక చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది స్మార్ట్​ఫోన్​ లాంటి పెళ్లికార్డండి. ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన ఓ వధువు తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహ శుభలేఖను ఈ విధంగా సెల్​ఫోన్​ నమూనాతో తయారు చేయించి తమ విభిన్నతను చాటుకుంటున్నారు.

పెళ్లి పత్రికల్లో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మార్పులు వస్తున్నాయి.. రకరకాల డిజైన్లలో వెడ్డింగ్ కార్డులు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పెట్టే ఖర్చును బట్టి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో మీరు చూస్తుంది ఫోన్ అనుకునేరు. అది కూడా వెడ్డింగ్ కార్డే.

ఖమ్మం జిల్లా మధిరలో గూడెల్లి నారాయణ రావు దంపతులు తమ కూతురి వివాహం కోసం సెల్ ఫోన్ ఆహ్వాన పత్రికను తయారు చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పెళ్లి కార్డులు.. నిజంగా సెల్ ఫోన్స్‌లానే అని అనిపిస్తున్నాయి.

పల్లె నుంచి పట్నం దాకా తమ ఇంట్లో శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు రూపొందించేటప్పుడు కొత్తదనం కోసం తాపత్రయపడుతున్నారు జనం. ప్రజల మనోగతానికి అనుగుణంగా కార్డు తయారీదారులు సైతం వినూత్న నమూనాలు రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఓ వధువు తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహ శుభలేఖను ఇలా సెల్ ఫోన్ నమూనాతో తయారు చేయించి తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..