Gost in Court: కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!

|

Aug 11, 2024 | 9:30 PM

మనుషులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారి శత్రువుల మీద రివేంజ్‌ తీర్చుకోవడం సినిమాల్లోనే చూసి ఉంటాం. అలాంటి ఇతివృత్తంతో అనేక సినిమాలు వచ్చాయి. కానీ నిజ జీవితంలో కూడా అచ్చం సినిమాల్లో వలెనే ఓ సంఘటన చోటు చేసుకుంది. తాను బతికుండగా రాచి రంపాన పెట్టిన ఓ కుటుంబాన్ని దెయ్యంగా మారి కోర్టుకు ఈడ్చింది. అవును.. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

మనుషులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారి శత్రువుల మీద రివేంజ్‌ తీర్చుకోవడం సినిమాల్లోనే చూసి ఉంటాం. అలాంటి ఇతివృత్తంతో అనేక సినిమాలు వచ్చాయి. కానీ నిజ జీవితంలో కూడా అచ్చం సినిమాల్లో వలెనే ఓ సంఘటన చోటు చేసుకుంది. తాను బతికుండగా రాచి రంపాన పెట్టిన ఓ కుటుంబాన్ని దెయ్యంగా మారి కోర్టుకు ఈడ్చింది. అవును.. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ కుటుంబంలోని ఐదుగురిని న్యాయస్థానానికి లాగింది.

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో జరిగిన ఈ ఘటన అటు న్యాయ వ్యవస్థను, ఇటు పోలీసు వ్యవస్థను పరేషాన్‌ చేసింది. శబ్ద్‌ ప్రకాశ్‌ అనే వ్యక్తి ఓ భూ తగదా విషయంలో 2011లోనే చనిపోయాడు. 2014లో ఓ కుటుంబంలోని పురుషోత్తమ్‌సింగ్‌, ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు సోదరులు మొత్తం ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రకాశ్‌ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. అనంతరం కేసు అలహాబాద్‌ హైకోర్టుకు చేరింది. పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో నిందితులు చార్జ్‌షీట్‌ను కోర్టులో సవాలు చేశారు.

కేసు విచారణ సందర్భంగా నిందుతుల తరపు న్యాయవాది శబ్ద్‌ ప్రకాశ్‌ 2011లోనే చనిపోయాడంటూ డెత్‌ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించాడు. తన భర్త చనిపోయిన విషయాన్ని ప్రకాశ్‌ భార్య మమత కూడా నిర్ధారించింది. దీంతో ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి జస్టిస్‌ సౌరభ్‌ శ్యామ్‌ షంష్రే చనిపోయిన వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశాడని కుషీనగర్‌ పోలీసులను ప్రశ్నించారు. మరణించిన వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారని, హైకోర్టులో అఫిడవిట్‌ను వ్యతిరేకిస్తూ సమర్పించిన పిటిషన్‌పైనా చనిపోయిన వ్యక్తి సంతకం చేసినట్టు తెలిసి అవాక్కయ్యారు. కేసును సమీక్షించిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. దీనిపై విచారణ చేయాలని కుషీనగర్‌ ఎస్పీని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తి పేరున అఫిడవిట్‌ దాఖలు చేసిన న్యాయవాదిని కోర్టు మందలించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.