Loading video

Young Look: నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్..

|

Oct 06, 2024 | 4:02 PM

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి అనుకుంటారు. ముఖం మీద చిన్న ముడత కనిపించినా తీవ్ర ఆందోళనకు గురవుతారు. అందుకే అందంగా మారేందుకు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకొంటున్నారు కొందరు కేటుగాళ్లు.

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి అనుకుంటారు. ముఖం మీద చిన్న ముడత కనిపించినా తీవ్ర ఆందోళనకు గురవుతారు. అందుకే అందంగా మారేందుకు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకొంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులకు మాయమాటలు చెప్పి కోట్లరూపాయలు కొల్లగొట్టారు. ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్ ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి వారిని నమ్మబలికారు. అలా పలువురి నుంచి ఏకంగా 35 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ – ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. ఆక్సిజన్ థెరపీతో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు… ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్‌ చేశారు.

మోసం ఎప్పడో అప్పడు బయటపడక మానదు. అలాగే వీరి బండారం కూడా బయటపడింది. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తనకు మాయమాటలు చెప్పి రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూ.35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.