Loading video

Mahanandi: తొలి ఏకాదశి పర్వదినాన మహానంది క్షేత్రంలో అద్భుతం.. ఒక్కసారిగా ఎగబడిన భక్తులు.

|

Jul 03, 2023 | 7:31 AM

తొలి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశినే శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురానవచనం.

తొలి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశినే శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురానవచనం. శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి తిథి అంటే ఎంతో ప్రీతి. అందుకే భక్తులంతా ఈ రోజు శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉపవాసదీక్ష చేస్తారు. ఈ పర్వదినాన నంద్యాలలోని మహానంది క్షేత్రంలో అద్భుతం చోటుచేసుకుంది. తొలిఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు.

మహానంది క్షేత్రంలోని రుద్రగుండం కోనేరు వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. కోనేరు వద్ద నాగుపామును గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఏకాదశి ఘడియల్లో శ్రీ మహావిష్ణువుతో పాటు పరమేశ్వరుడి దర్శనం కూడా జరిగిందంటూ భక్తులు నాగుపామును చూసేందుకు పోటీపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ నాగుపామును బంధించి భద్రంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...