Loading video

Vieral: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన బుడ్డోడు.. వైరల్ వీడియో.

|

Sep 05, 2023 | 10:55 AM

అంతరిక్షంలో ఇస్రో విజయపరంపర కొనసాగుతోంది. చంద్రయాన్ 3, ఆదిత్య-L 1 విజయంతో దూసుకుపోతున్న ఇస్రో వచ్చే నెలలో గగన్‌యాన్‌కు సిద్ధమవుతోంది. అనంతరం శుక్రయాన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. చంద్రయాన్‌ సక్సెస్‌తో ఇస్రో చీఫ్ సోమనాథ్‌ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి అరుదైన బహుమతిని ఇచ్చి ప్రశంసించాడు.

అంతరిక్షంలో ఇస్రో విజయపరంపర కొనసాగుతోంది. చంద్రయాన్ 3, ఆదిత్య-L 1 విజయంతో దూసుకుపోతున్న ఇస్రో వచ్చే నెలలో గగన్‌యాన్‌కు సిద్ధమవుతోంది. అనంతరం శుక్రయాన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. చంద్రయాన్‌ సక్సెస్‌తో ఇస్రో చీఫ్ సోమనాథ్‌ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి అరుదైన బహుమతిని ఇచ్చి ప్రశంసించాడు. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన ఆ పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ ఖాతా ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. చంద్రయాన్ 3 విజయంతో భావితరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్‌ను కొనియాడారు. ఆ బాలుడి ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్‌లో బాలుడు మంచి శాస్త్రవేత్తగా ఎదగాలని బాలునికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. 14 రోజులపాటు 100 మీటర్లు పైన ప్రయాణించిన రోవర్‌ ఎంతో కీలక సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. ఇప్పుడు జాబిల్లి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. మరోవైపు ఆదిత్య ఎల్‌1… 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..