Child Elephant: కెమెరాను చూసి రెచ్చిపోయిన చిన్నారి ఏనుగు.. గున్న ఏనుగు వింత చేష్టలు.. ఏం చేసిందో చూడండి..

|

Sep 04, 2022 | 9:11 AM

ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని ఆలోచింపచేస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన


ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని ఆలోచింపచేస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో కోకొల్లలు. తాజాగా ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఓ ఏనుగు పిల్ల తొలిసారి కెమెరాను చూసి ఆశ్చర్యపోయింది. అంతేకాదు వింతగా ప్రవర్తిస్తూ రచ్చ చేసింది.అటవీ మైదాన ప్రాంతంలో ఓ తల్లి ఏనుగు తన రెండు పిల్ల ఏనుగులతో కలిసి మేత మేస్తోంది. ఓ టూరిస్ట్‌.. ఆ ఏనుగులను వీడియో తీస్తున్నాడు. అయితే, టూరిస్ట్ వీడియో తీయడాన్ని గమనించిన ఏనుగు పిల్ల.. అదేంటో చూద్దామని నేరుగా కెమెరా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. మళ్లీ ఏమనుకుందో.. తీరా కెమెరా వద్దకు వచ్చాక.. పీచే‌ముడ్ అంటూ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. వెంటనే సైడ్ టర్న్ తీసుకుని మరోవైపు పరుగులు తీసింది. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వేలాదిమంది గున్న ఏనుగు చేష్టలకు ఫిదా అయిపోయారు. లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Follow us on