Cheetah: సిరిసిల్ల జిల్లాలో అటవీప్రాంతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శివలింగాలపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని డంపింగ్‌యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పిల్లల కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. చిరుత పిల్లలను చూసిన స్థానికులు ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పిల్లలకోసం ఏ టైములోనైనా అటు రావచ్చని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శివలింగాలపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని డంపింగ్‌యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పిల్లల కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. చిరుత పిల్లలను చూసిన స్థానికులు ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పిల్లలకోసం ఏ టైములోనైనా అటు రావచ్చని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున తల్లి చిరుత ఓ పిల్లను నోటకరుచుకొని వెలుతుండగా పొలం పనుల కోసం వెళ్లిన ఓ రైతు చూసి గ్రామ సర్పంచ్ కు సమాచారం ఇచ్చాడు. ఇంతలో చిరుత అక్కడ్నుంచి వెళ్లిపోగానే ఆ చుట్టుపక్కల పరిశీలించగా మరో చిరుత పిల్ల కనిపించింది. ఆ పిల్లకోసం తల్లి చిరుత మళ్లీ రావచ్చని చెట్ల చాటున ఉండి గమనించాడు. తల్లి చిరుత ఎంతకీ రాకపోవడంతో పిల్లచిరుతను రక్షించాడు. సర్పంచ్ అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులి పిల్లను సంరక్షించి, దానికి పాలు తాగించి, అదే ప్రాంతంలో వదిలిపెట్టారు. సిరిసిల్ల రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, సెక్షన్ ఆఫీసర్ బాపురాజులు అక్కడికి వచ్చిన ప్రజలను పిల్ల కోసం తల్లిచిరుత మళ్లీ రావచ్చని, కనుక ప్రజలెవరూ ఇటు రావద్దని సూచించారు. తల్లి చిరుతపులి వచ్చి ఉన్న పిల్లను తీసుకువెళ్తుందనీ, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఒక వేళ తల్లి చిరుత రాని పక్షంలో చిరుత కూనను కరీంనగర్ కు తరలిస్తామన్నారు. ఇప్పటికే ఈ అటవీ ప్రాంతంలో ఆరు చిరుతపులులు ఉన్నాయని, మరో రెండు చిరుతపులి పిల్లలు రావడంతో వాటి సంఖ్య ఎనిమిది చేరినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త గా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..