Fire in Car: అర్ధరాత్రి హైవేపై కారులో మంటలు.. అటుగా వెళ్తున్న సీఎం.. కాన్వాయ్‌ ఆపి మరి ఎం చేసాడంటే..

|

Sep 20, 2022 | 9:20 AM

కార్లలో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. ఎక్కువగా జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. షార్ట్‌సర్య్కూట్‌ వల్లనో, మరేదైనా కారణంతోనో కార్లలో మంటలు చెలరేగుతుంటాయి.


కార్లలో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. ఎక్కువగా జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. షార్ట్‌సర్య్కూట్‌ వల్లనో, మరేదైనా కారణంతోనో కార్లలో మంటలు చెలరేగుతుంటాయి. సెప్టెంబర్‌ 12 రాత్రి ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై లగ్జరి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. కాలిపోతున్న కారును చూసిన తన కాన్వాయ్‌ను ఆపి బాధితులను పరామర్శించారు. బాధితులకు సీఎం ధైర్యం చెప్పారు.అనంతరం మంటల్లో చిక్కుకుని బయటపడిన కారు డ్రైవర్‌ విక్రాంత్‌ తో సీఎం మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు డ్రైవర్‌ తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్‌ 12 అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. సీఎం తమను పరామర్శించి ఆదుకుంటానని హామీ ఇవ్వడంపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలుపడంతో వారు హుటాహుటిన రెండు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on