Bull fight video: నడిరోడ్డుపై ఎద్దుల బీభత్సం.. నానా హంగామా చేస్తూ రెచ్చిపోయిన తాడిపెద్దు..
తాడిపెద్దు అంటే మామూలు ఎద్దు కాదు.. ఎద్దుల్లోకే మేలు జాతి ఎద్దు. దానికి చిర్రెత్తుకొచ్చిందంటే అది చేసే బీభత్సానికి హద్దూ అదుపూ ఉండదు. కాకినాడ జిల్లాలో ఓ తాడిపెద్దు తెగబడింది..
తాడిపెద్దు అంటే మామూలు ఎద్దు కాదు.. ఎద్దుల్లోకే మేలు జాతి ఎద్దు. దానికి చిర్రెత్తుకొచ్చిందంటే అది చేసే బీభత్సానికి హద్దూ అదుపూ ఉండదు. కాకినాడ జిల్లాలో ఓ తాడిపెద్దు తెగబడింది.. నానా హంగామా చేసింది. జిల్లాలోని తుని పట్టటణంలో నడిరోడ్డుపై, జనావాసాలపై తాడిపెద్దు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.. కనిపించినవారిని కనిపించినట్టు వెంబడించి… కుమ్మిపారేసింది. రోడ్డు మీద వెళ్లే పాదచారులను, వాహనదారులను ఎవరినీ వదలకుండా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది తీవ్రగా గాయపడగా… ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా ఏరియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.ఈ ఎద్దుల పోట్లాట చూసి సాటి పశువులు కూడా భయపడిపోయాయి. ఇక జనాలు అటు వెళ్లడానికి సాహసించలేదు. కాగా ఈ ఎద్దులను అదుపుచేసేందుకు మున్సిపల్ సిబ్బంది, పశుసంవర్థకశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. మత్తు మందు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆలోపే ఎద్దు చనిపోయింది. కుక్క కరవడం వల్ల ఆ ఎద్దుకు ర్యాబిస్ వ్యాధి సోకిందని, అందువల్లే అలా ప్రవర్తించిందని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. ఆ ఆంబోతుకు సంబంధించి ఎవరూ రాకపోవడంతో మున్సిపల్ అధికారులు.. డంపింగ్ యార్డుకు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..