Buffalo Viral: రూ.2 లక్షల విలువైన మంగళసూత్రాన్ని మింగేసిన గేదె..!

|

Oct 03, 2023 | 3:57 PM

మహారాష్టలోని వాషిమ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె రెండు లక్షల రూపాయల విలువైన బంగారు మంగళసూత్రాన్ని మింగేసింది. దీంతో ఆ యజమాని పశువుల వైద్యుడిని సంప్రదించాడు. ఆ గేదెకు 2 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స చేశారు పశు వైద్యులు. ఎట్టకేలకు ఆ బంగారు మంగళసూత్రాన్ని బయటకు తీశారు. వాషిమ్‌లోని సర్సీ గ్రామానికి చెందిన ఒక మహిళ సెప్టెంబర్ 27న నిద్రపోయే ముందు.. రాత్రి తన మంగళసూత్రాన్ని ప్లేట్‌లో ఉంచింది.

మహారాష్టలోని వాషిమ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె రెండు లక్షల రూపాయల విలువైన బంగారు మంగళసూత్రాన్ని మింగేసింది. దీంతో ఆ యజమాని పశువుల వైద్యుడిని సంప్రదించాడు. ఆ గేదెకు 2 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స చేశారు పశు వైద్యులు. ఎట్టకేలకు ఆ బంగారు మంగళసూత్రాన్ని బయటకు తీశారు. వాషిమ్‌లోని సర్సీ గ్రామానికి చెందిన ఒక మహిళ సెప్టెంబర్ 27న నిద్రపోయే ముందు.. రాత్రి తన మంగళసూత్రాన్ని ప్లేట్‌లో ఉంచింది. మరుసటి రోజు అదే ప్లేటులో సోయాబీన్ పొట్టుతో గేదెకు తినిపించింది. గేదె మేత ను తినడంతోపాటు మంగళసూత్రాన్ని కూడా మింగేసింది. కాసేపటికి తన మంగళసూత్రం కనిపించకపోవడంతో గందరగోళానికి గురైంది. ఎక్కడ వెతికినా లాభం లేకపోయింది. చివరికి సోయాబీన్ పొట్టుతో పాటు మంగళసూత్రాన్ని గేదె మింగేసినట్టు గుర్తించింది. వెంటనే పశువైద్యులను సంప్రదించారు కుటుంబ సభ్యులు. మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి గేదె కడుపులో బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. రెండు గంటలపాటు శ్రమించి గేదెకు శస్త్రచికిత్స చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు వైద్యులు. ప్రస్తుతం గేదె ఆరోగ్యంగా ఉందని వైద్యాధికారి బాలాసాహెబ్ కౌండనే తెలిపారు.​​​ ​​​ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..