Man – Bird: ఆపదలో ఆదుకున్న అతనే తన సర్వస్వం అనుకుంది.. స్నేహానికి ముచ్చతెస్తుంది..

|

Mar 09, 2023 | 8:53 AM

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటర్‌ పైన వెళ్తున్నాడు. అతని వెనకే ఓ పెద్ద పక్షి ఎగురుకుంటూ వెళ్తోంది. చూస్తే ఆ పక్షి అతనిపై ఎటాక్‌ చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌. తన ఫ్రెండ్‌ ఎక్కడికి వెళ్తే

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటర్‌ పైన వెళ్తున్నాడు. అతని వెనకే ఓ పెద్ద పక్షి ఎగురుకుంటూ వెళ్తోంది. చూస్తే ఆ పక్షి అతనిపై ఎటాక్‌ చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌. తన ఫ్రెండ్‌ ఎక్కడికి వెళ్తే అక్కిడి ఆ పక్షి వెళ్తుంది. ఇంతకీ ఈ పక్షికీ, ఆ వ్యక్తికీ స్నేహం ఎలా? అనుకుంటున్నారా.. యూపీలోని అమేథికి చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి ఓరోజు పొలంలో ఉండ‌గా గాయ‌ప‌డిన ప‌క్షి అత‌డి కంట‌ప‌డింది. ప‌క్షిని చేర‌దీసి, ఆరిఫ్ దాని ఆరోగ్యం కుదుట‌ప‌డేలా స‌ప‌ర్యలు చేసాడు. కోలుకున్న త‌ర్వాత ప‌క్షి ఎగురుకుంటూ వెళ్లిపోతుంద‌ని ఆరిఫ్ అనుకున్నాడు. కానీ అ పక్షి అలా చేయలేదు. అతనిపై కృతజ్ఞతతో ఆరిఫ్‌ వెంటే ఉండిపోయింది. త‌న‌ను కాపాడిన ఆరిఫ్‌ను అనుక్షణం అనుస‌రిస్తూనే ఉంది. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా ప‌క్షి అత‌డిని అనుస‌రిస్తోంది. వారిద్దరి మ‌ధ్య అనుబంధానికి ఈ వీడియో ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. వారి స్నేహానికి ముచ్చట‌ప‌డిన ఇంట‌ర్‌నెట్ వారిని షోలేలోని జై-వీరూగా పిలుస్తోంది. ఈ అద్భుతమైన వీడియోను ఐఏఎస్ అధికారి అవ‌నీష్ శ‌ర‌ణ్ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 16 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 09, 2023 08:53 AM