AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Driver: ఇతను ఆటోడ్రైవర్‌ మాత్రమే కాదు అంతకు మించి.. వింటే మైండ్‌ బ్లాంకే..!

Auto Driver: ఇతను ఆటోడ్రైవర్‌ మాత్రమే కాదు అంతకు మించి.. వింటే మైండ్‌ బ్లాంకే..!

Anil kumar poka
|

Updated on: Mar 27, 2023 | 8:55 AM

Share

ఓ ఆటో డ్రైవర్‌ ఆర్థక పాఠాలను అవలీలగా వివరిస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. పగలంతా ఆటో నడుపుతూ... రాత్రివేళ తనకు తెలిసిన ఆర్ధిక విషయాలను యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు.

ఓ ఆటో డ్రైవర్‌ ఆర్థక పాఠాలను అవలీలగా వివరిస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. పగలంతా ఆటో నడుపుతూ… రాత్రివేళ తనకు తెలిసిన ఆర్ధిక విషయాలను యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఆటోడ్రైవ‌ర్ స్టోరీని సుశాంత్ కోషీ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈరోజు నా ఉబ‌ర్ ఆటో డ్రైవ‌ర్ ప‌ర్సన‌ల్ ఫైనాన్స్‌లో నిపుణుడైన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయ‌న్సర్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. జ‌నార్ధన్ యూట్యూబ్ చానెల్ చూస్తే ఆశ్చర్యానికి లోన‌య్యాన‌ని కోషీ రాసుకొచ్చారు. ఈ జనార్ధన్‌ అనే ఈ వ్యక్తి బెంగళూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. జనార్థన్‌ కేవలం ఆటో డ్రైవర్‌ మాత్రమే కాదు.. ఇతన్ని పట్టాలేని ఆర్ధికవేత్తగా చెప్పవచ్చు… ఎందుకంటే ఆర్ధికవ్యవహారాలు, బ్యాంకింగ్‌పైన ఇతనికి ఉన్న అవగాహణ అలాంటిది మరి. అదే అతని కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ‘గోల్డ్‌ జనార్ధన్‌ ఇన్వెస్టర్‌’ పేరితో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలు పెట్టారు. ‘ద్రవ్య లోటు ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు పడేబదులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ కరెన్సీ నోట్లను ప్రింట్‌ చేసేయొచ్చు కదా.. అని చాలామందికి అనిపించి ఉంటుంది. ఇలాంటి వారికి సరైన అవగాహన కలిగేలా .. రిజర్వ్‌ బ్యాంక్‌ అలా ఎందుకు చేయడం లేదు? ప్రస్తుతం భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? బంగారంపై పెట్టుబడులు మంచిదేనా? ’ ఇలా విభిన్న అంశాలపై తనదైన శైలిలో వివరణ ఇస్తూ వీడియోలను పోస్టు చేశారు. వీలుదొరికినప్పుడల్లా కొన్ని వీడియోలు అందులో పోస్టు చేస్తూ వచ్చారు. అంతేకాదు, తన యూట్యూబ్‌ ఛానెల్‌ గురించి తెలియజేస్తూ అతని ఆటో ఓ బ్యానర్‌ను కూడా అంటించారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందిగా కోరారు. ఇలా, తన ఛానెల్‌కు ప్రచారం కల్పించుకున్నారు. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, వివిధ గ్రాఫ్‌లు, చిత్రాలతో వివరించడం జనార్ధన్‌ ప్రత్యేకత. అయితే, కేవలం కన్నడ భాషలోనే అతడు వివరణ ఇస్తుండటంతో ఇతర భాషల వారికి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ సాధారణ వ్యక్తి.. ఆర్థిక పరమైన అంశాలను వివరిస్తూ.. దాన్నే కెరీర్‌గా మలచుకోవడానికి ప్రయత్నించడం నిజంగా అభినందనీయం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 27, 2023 08:55 AM