Climbs building: వామ్మో ఈ ఏజ్ లో ఇలా ఉన్నారు అంటే ఆ ఏజ్ లో.. చకచకా ఎలా ఎక్కేసాడో చూడండి..

Updated on: Sep 26, 2022 | 9:59 AM

60 years old man , Climbs , 48 floors building , short time , 48 floors , 60 years old , 60 years , old man Climbs a building , old man Climbs a building viral video , old man Climbs a building video ,old man Climbs , old man , Climbs a building


సాధించాలనే సంకల్పానికి.. వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఫ్రాన్స్‌కు చెందిన అలైన్‌ రాబర్ట్‌. 60 ఏళ్ల వయస్సులోనూ ఏకంగా 48 అంతస్తుల భవనాన్ని చకచకా ఎక్కేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఎత్తయిన భవంతులను ఎక్కి ‘ఫ్రెంచ్‌ స్పైడర్‌మ్యాన్‌’గా గుర్తింపు పొందిన ఆయన.. గత నెలలో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పారిస్‌లోని 187 మీటర్ల ఎత్తయిన 48 అంతస్తుల భవనం ‘టూర్‌ టోటల్‌’ను ఎక్కేశారు. కేవలం 60 నిమిషాల్లోనే ఆయన భవనం పై అంతస్తుకు చేరుకున్నారు. ‘60 ఏళ్లున్నా ఏం కాదనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనుకున్నా. ఈ వయసులోనూ ఆటలాడొచ్చు. చురుకుగా ఉండొచ్చు.. అద్భుతమైన పనులు చేయొచ్చు’ అని రాబర్ట్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘నాకు 60 ఏళ్లు నిండాక.. ఈ టవర్‌ను మళ్లీ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఎందుకంటే ఫ్రాన్స్‌లో 60 ఏళ్లను పదవీ విరమణ వయస్సుగా పరిగణిస్తారు. దీనికి భిన్నంగానే ఈ ప్రయత్నం చేశా’ అని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆయన గతంలోనూ అనేకసార్లు ఈ టవర్‌ను ఎక్కారు. ఎత్తయిన భవనాలు ఎక్కడంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 26, 2022 09:57 AM
Follow Us