Bike rider: కార్తీక్ నువ్వు గ్రేట్.! ఒక్క లక్ష్యం కోసం 1.40 లక్షల కి.మి. బైక్ యాత్ర..!
వంద కాదు.. వెయ్యి కాదు ఏకంగా లక్షా 40 వేల కిలో మీటర్ల మేర బైక్‌పై ప్రయాణం.. అవును మీరు విన్నది నిజమే.. ఆ యువకుడు బైక్ పై చేసిన ప్రయాణం గిన్నిస్ బుక్ రికార్డ్ కోసమో సరదా కోసమో కాదు మానవ జన్మ అత్యుత్తమమని నిరూపించడానికి.. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని నిలబడి.. జీవితాన్ని నిండు నూరేళ్లు ఆస్వాదించాలని చాటి చెప్పడమే అతని ఉద్దేశమట.
వంద కాదు.. వెయ్యి కాదు ఏకంగా లక్షా 40 వేల కిలో మీటర్ల మేర బైక్‌పై ప్రయాణం.. అవును మీరు విన్నది నిజమే.. ఆ యువకుడు బైక్ పై చేసిన ప్రయాణం గిన్నిస్ బుక్ రికార్డ్ కోసమో సరదా కోసమో కాదు మానవ జన్మ అత్యుత్తమమని నిరూపించడానికి.. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని నిలబడి.. జీవితాన్ని నిండు నూరేళ్లు ఆస్వాదించాలని చాటి చెప్పడమే అతని ఉద్దేశమట. ఒత్తిడి తట్టుకోలేక జీవితాన్ని సగంలో ముగించాలి అనుకునే వారికి జీవిత సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నెల్లూరు కి చెందిన తూపిలి వెంకట కార్తీక్.. తన జీవితంలో ఎదురుకొన్న ఒత్తిడి మరొకరికి ఉండకూడదని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వెంకట కార్తీక్. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేటకు చెందిన తూపిలి వెంకట కార్తీక్ బీటెక్ పూర్తి చేశాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
అయితే తాను పడిన ఒత్తిడి గురించి తన తల్లిదండ్రులు మల్లికార్జున్ రావు, సుజాత లకు వివరించాడు. అంతేకాదు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందని తెలుసుకున్న కార్తీక్.. అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా బైక్ యాత్ర ప్రారంభించాడు కార్తీక్. నెల్లూరు నుంచి గత ఏడాది ఫిబ్రవరి 14 న మొదలైన కార్తీక్ బైక్ యాత్ర 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ లక్షా 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. అక్టోబర్ 6 న తిరిగి నెల్లూరుకు చేరుకుంది. యాత్ర పూర్తి చేసుకుని నెల్లూరు కి వచ్చిన కార్తీక్ కి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇప్పటి వరకు లక్షా 39 వేల కిలో మీటర్ల బైక్ యాత్ర రికార్డ్ అమెరికా దేశానికి చెందిన యువతి పేరిట ఉంది. తాన ఇప్పటికే లక్షా 40 వేల కిలోమీటర్ల దూరం బైక్ యాత్ర చేశానని.. తన ప్రయాణ వివరాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీ గా తీస్తున్నానంటున్న కార్తీక్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టూ ఫేస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..