80 Seconds washing Machine: 80 సెకన్లలో దుస్తులుతికే మెషిన్‌! సబ్బు.. నీరూ లేకుండానే.. ఎక్కడో తెలుసా..?

|

Aug 05, 2022 | 9:58 AM

వాషింగ్‌మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటర్జెంట్‌ పౌడర్‌కు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికి పెడుతుంది


వాషింగ్‌మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటర్జెంట్‌ పౌడర్‌కు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికి పెడుతుంది ఓ వాషింగ్‌ మెషీన్‌. చండీగఢ్‌కు చెందిన అంకురసంస్థ ‘80వాష్‌’ ఇలాంటి చిత్రమైన, అద్భుతమైన వాషింగ్‌మెషిన్‌నే తయారుచేసింది. వాషింగ్‌మిషిన్లు నీళ్ల వాడకం విషయంలో పెద్దగా సాధించిందేమీ లేదు. చెంచాడు మురికిని వదిలించటానికి సుమారు 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి. ఈ నీరంతా మురికి కాల్వల్లోకే చేరి పర్యావరణానికీ హాని చేస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ 80వాష్‌ రూపొందించిన వాషింగ్‌మిషిన్‌ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. కేవలం కప్పు నీటితోనే ఐదు దుస్తులను ఉతికేస్తుంది. అదీ సబ్బు అవసరం లేకుండానే.. అతి తక్కువ సమయంలోనే! కేవలం 80 సెకన్లలోనే దుస్తులను ఉతికి పెడుతుంది. మురికి ఎక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది.

80 వాష్‌ సంస్థను రూబుల్‌ గుప్తా, నితిన్‌ కుమార్‌ సలుజా, వరిందర్‌ సింగ్‌ ఆరంభించారు. మెషిన్‌ స్టీమ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేవ్‌ పరిజ్ఞానం సాయంతో బ్యాక్టీరియాను చంపుతుంది. 7-8 కిలోల సామర్థ్యం గల మిషిన్‌ ఒకసారి ఐదు దుస్తులను ఉతుకుతుంది. అదే 70-80 కిలోల సామర్థ్యం గల పెద్ద మిషిన్‌తోనైతే ఒకేసారి 50 దుస్తులను ఉతుక్కోవచ్చు. దీనికి 5-6 గ్లాసుల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం ఈ వాషింగ్‌మిషిన్‌ను ప్రయోగాత్మక పరీక్షల కోసం మూడు పట్టణాల్లో అమర్చారు. హాస్టల్‌ విద్యార్థులకు నెలకు 200 చొప్పున వసూలు చేస్తూ దుస్తులు ఉతుక్కోవటానికి అనుమతిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..