Crocodiles: హమ్మయ్య.. తప్పించుకున్న మొసళ్లన్నీ దొరికాయి..! 70 మొసళ్ళు ఒక్కసారిగా తప్పించుకున్నాయి.

|

Sep 20, 2023 | 6:43 PM

చైనాలో భారీ వరదల కారణంగా ఓ ఫామ్‌ నుంచి 70కి పైగా మొసళ్లు తప్పించుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుమారు వారం రోజులు గాలించి వాటిని వెతికి పట్టుకున్నారు. దక్షిణ చైనాలోని మావోమింగ్‌ నగరంలో సెప్టెంబర్ ప్రారంభంలో హైకూయ్‌ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు రావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ఓ మొసళ్ల పెంపక కేంద్రం నుంచి సుమారు 70 మొసళ్లు తప్పించుకున్నాయి.

చైనాలో భారీ వరదల కారణంగా ఓ ఫామ్‌ నుంచి 70కి పైగా మొసళ్లు తప్పించుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుమారు వారం రోజులు గాలించి వాటిని వెతికి పట్టుకున్నారు. దక్షిణ చైనాలోని మావోమింగ్‌ నగరంలో సెప్టెంబర్ ప్రారంభంలో హైకూయ్‌ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు రావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ఓ మొసళ్ల పెంపక కేంద్రం నుంచి సుమారు 70 మొసళ్లు తప్పించుకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. మొసళ్ల కోసం వారం రోజులపాటు వేట కొనసాగించారు. ఈ క్రమంలో బంధించిన వాటిని కార్మికులు తాళ్లతో కట్టి లాగుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆచూకీ లేకుండా పోయిన సియామిస్‌ మొసళ్లను తిరిగి బంధించారు. చివరి మొసలి సెప్టెంబర్ 18 రాత్రి చిక్కిందని ఓ చైనీస్‌ మీడియా సంస్థ పేర్కొంది. డజన్ల కొద్దీ మొసళ్లు బురదలో పొర్లుతున్న దృశ్యాలను ఆ మీడియా సంస్థ విడుదల చేసింది. పట్టుకున్న మొసళ్ళకు కొంత మంది కార్మికులు గొడుగులు పట్టుకుని వాటి చుట్టూ కాపలాగా నిల్చున్నారు. ఫామ్‌ నుంచి బయటకు వెళ్లిన మొసళ్లలో 69 పెద్దవి కాగా.. 2 చిన్నవి. చైనాలో మొసళ్ల చర్మం, మాంసానికి మంచి గిరాకీ ఉంది. వాటిని కొన్నిసార్లు సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..