Watch: కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణాలు.!

|

Nov 07, 2024 | 5:33 PM

కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. చివరగా సీటీ స్కాన్ చేయగా.. అతడి కడుపులో ఉన్న వాటిని చూసి పరేషాన్ అయ్యారు. అతడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 65 రకాల ఇనుప వస్తువులు చూసి ఆశ్చరపోయారు..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఆదిత్య శర్మ అనే 14 యేళ్ల బాలుడు తీవ్ర కుడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వ్యైద్యులు బాలుడి కడుపు నొప్పికి గల కారణాలు తెలుసుకునేందుకు కడుపు భాగాన్ని సీటీ స్కానింగ్‌ చేశారు. అందులో నాసల్ బ్లాకేజ్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి కడుపులో రకరకాల వస్తువులు కనిపించాయి. వాటిల్లో బ్యాటరీలు, గొలుసులు, రేజర్ బ్లేడ్‌లు కూడా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాలుడికి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వెంటనే నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు.

అనంతరం బాలుడి పరిస్థితి క్లిష్టంగా మారడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. అదే రోజు నోయిడాలోని డాక్టర్లు ఆపరేషన్‌ మొదలు పెట్టారు. సుమారు 6 గంటలపాటు ఆపరేషన్‌ చేసి బాలుడి కడుపు నుంచి బ్యాటరీలు, బ్లేడ్లు, స్క్రూలు వంటి దాదాపు 65 రకాల వస్తువులను బయటికి తీశారు. ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగిన కొన్ని గంటలకే బాలుడు మృతి చెందాడు. గత నెల 28న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో ఈ ఘటన జరిగింది. కడుపులోని వస్తువుల కారణంగా తీవ్రమైన పేగు ఇన్‌ఫెక్షన్‌ జరిగి బాలుడు మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.